అనాధా పిల్లలతో ఆస ఫౌండేషన్ బతుకమ్మ సంబురాలు

29

కూకట్ పల్లి లోని ఏఎస్ రాజు నగర్ కమ్యూనిటీ హాల్ లో నిన్న మారుతి అనాధాశ్రమం పిల్లలతో ఆస ఫౌండేషన్( AASA/ Action Aid For Societal Advancement )బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.మియాపూర్ లోని మారుతీ ఆర్ఫన్ఏజ్ కి చెందిన దాదాపు 100 మంది పిల్లలు చేరి బతుకమ్మలను పేర్చి ఆడుతూ, పాడుతూ పండుగ జరుపుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు.ఆస ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏఎస్ రాజు నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు మద్దతు అందజేశారు. ఈ సందర్భంగా అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఆస ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సోనియా ఆకుల మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగను మారుతీ అనాధాశ్రమం కి చెందిన పిల్లలతో జరుపుకోవడం ఆనందంగా ఉన్నారు.అనాధ పిల్లలకు మా ఆస ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని , తమవంతుగా ప్రతి ఏడాది చిన్నారులతో కలిసి కార్యక్రమాలు జరుపుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక సృహ కల్గి ఉండాలని, తాము సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అనాధలకు దానాలు చేయాలని వారి సంతోషంలో భాగం కావాలని కోరారు.

పిల్లలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆ కాసేపైనా రోజువారీ బాధలను మరిచి సంతోషంతో మురిసిపోయే బతుకమ్మ పండుగలో భాగస్వాములను చేసినందుకు ఆనందశరణాలయా నిర్వాహకురాలు ఆస ఫౌండేషన్ వారికీ ధన్యవాదాలు తెలిపారు. పిల్లలకు ఇది మానసిక ఉల్లాసం కలిగిస్తుందని విద్యార్థులు ఆడి-పాడిన బతుకమ్మ ఆటను చూసి ఆనందం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మారుతీ అనాధ శరణాలయానికి చెందిన చిన్నారులతో పాటు ఆస ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కుమారి ఆకుల సోనియా , జనరల్ సెకట్రరీ శ్రీమతి దివ్య నాయుడు , నగేష్ ఆకుల , వాలంటీర్లు గా రాఘవ్ ఇంద్ర ,అరుణ్, మధు,,విద్య, వనజ,సింధు,వరుణ్, నరేందర్ గౌడ్ నగునూరి, బత్తిని వినయ్ ,జయవీర్ ,లక్ష్మణ్ రుదవత్ పాల్గోన్నారు.