తెలంగాణ ఉద్యమకారుడికి అరుదైన పురస్కారం

0
132

విద్యార్థుల ఆత్మ గౌరవం ,బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం ,రాజ్యాధికారం కోసం దశాబ్ద కాలంగా చేస్తున్న సేవలకు తెలంగాణ యువ ఉద్యమకారుడు ఆకుల స్వామి వివేక్ కి అరుదైన పురస్కారం లభించింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పటు పడే వాళ్లకు జాతీయ స్థాయిలో ఇచ్చే అంబెడ్కర్ ఫెలోషిప్ అవార్డును ఆదివారం ఢిల్లీలో దళిత రచయితల కార్యక్రమంలో దళిత సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సుమనస్కర్ అందచేశారు.

పెద్దపల్లి జిల్లా,గోదావరిఖనికి చెందిన వివేక్ జేఎన్టీయూ జాక్ కన్వీనర్ గా పనిచేస్తున్నారు. విద్యార్థులను తెలంగాణ ఉద్యమంలోకి తేవటానికి కృషి చేశారు. ఈ అవార్డు తనకు రావటంతో తనపైన చాలా సామజిక బాధ్యత పెరిగిందని వివేక్ చెప్పాడు. అవార్డు రావటంపై పెద్దపల్లి వాసులు హర్షాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here