హాలీవుడ్ లో సినిమాలు చేస్తా…అర్జున్ రెడ్డి డైరెక్టర్

58

అర్జున్ రెడ్డి… ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీ లో విడుదలైన కొత్త తరహా చిత్రం. యువతకి బాగా కనెక్ట్ ఐన చిత్రం కూడ. విడుదలకి ముందు నుండి అనేక వివాదాలతో ప్రేక్షకుల ముందికి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం సినిమా హాల్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ముందుకి సాగిపోతుంది. 

సినిమా విడుదలకి ముందు హన్మంతరావు గారి కామెంట్స్, తరువాత జబర్దస్త్ యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్ సినిమాపై అంతగా ప్రభావం చూపించకపోయిన కొన్ని మహిళా సంఘాలు దియేటర్లో  సినిమా చూడోద్దని నిరసనలు చేయడంపై అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. మహిళా సంఘాలు సినిమాను ఎందుకు అడ్డుకుంటూన్నాయో అర్ధం కావట్లేదని ,ఇలా చేస్తే తాను ఇక తెలుగులో సినిమాలు తీయడం మానేస్తా అని అసహనం వ్యక్తం చేసాడు.

ఇకపై ఇలాగే చేస్తే తానూ బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటా అని అక్కడ కూడ అడ్డుకుంటే హాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటా అని మండిపడ్డారు.