భారత్ లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కి జరుగనున్న శంకుస్థాపన

44
Bullet train in India
Bullet train in India

భారత దేశ అభివృద్ధికి మరో ప్రాజెక్ట్ సహాయపడనున్నది. విదేశాలలో మాత్రమే చూడగలిగే బుల్లెట్ రైలు ను ఇప్పుడు మన దేశంలో కూడా చూడవచ్చు. అలాగే అందులో ప్రయాణించవచ్చు. దీని కోసం ఈ నెల 14 వ తేదిన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ , జపాన్ ప్రధాని షింజో అబె పాల్గొననున్నారు. సుమారు 1.08 లక్షల కోట్ల వ్యయంతో ముంబై – అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ. మార్గంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో 12 స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి జపాన్ దేశం 81% నిధులను మిగతాది మన దేశం అందిస్తుంది.