పెరిగిపోతున్న మెక్సికో భూకంప మృతుల సంఖ్య

43
Earthquake in Mexico
Earthquake in Mexico

ప్రపంచం లో వాతావరణ మార్పులు, కాలుష్య ప్రభావం ప్రస్తుత ప్రాణ కోటికి పెను ముప్పుగా మారుతుంది. రోజు రోజుకి వాతావరణ మార్పులే దీనికి కారణంగా తెలుస్తుంది. గత గురువారం మెక్సికో నగరంలో సంభవించిన భూకంపం గత శతాబ్ద కాలంలో సంభవించిన వాటికన్నా అత్యంత శక్తివంతమైనది గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఈ భూకంప దాటికి 90 మంది మృతి చెందినట్లుగా అధికారులు తెలియజేసారు. రిక్టర్ స్కేల్ పై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మెక్సికో, టోబాస్కో , ఒక్సాకా, చైపాస్ నగరాలను అతలాకుతలం చేసింది. దీనితో భారీ ఆస్తి – ప్రాణ నష్టం సంభవించాయి.