ఇస్రో దాస్తోన్న పెను ప్రమాదం జరిగేనా?

69
IRNSS-1H Failed rocket reach earth early
IRNSS-1H Failed rocket reach earth early
    భారత దేశ మేథో శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఇస్రో కే చెందుతుంది. ప్రపంచ దేశాల చూపు మన దేశం వైపు తిప్పింది కూడా ఇస్రోనే. వరుస ప్రయోగాలు చేస్తూ విజయాన్ని స్వంతం చేసుకుంటూ ప్రపంచానికి భారతీయ శక్తిని తెలుపుతుంది. కాని గత నెల 31న ఇస్రో ప్రయోగించిన IRNSS-1H ఉపగ్రహం విఫలమవడం కొంత కలవరపడే విషయం.

    అయితే IRNSS-1H ఉపగ్రహం రోదసిలో కొట్టుమిట్టాడుతుందని సమాచారం. అది మరో 40 – 50 రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే పెను ప్రమాదం జరుగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

    భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఉపగ్రహం పేలిపోయి దాని నుండి వచ్చే శకలాలతో తీవ్ర నష్టం జరుగుతుందని అలాగే ఆ శకలాలు ఎక్కడ పడేవి అనేది భూ వాతావరణానికి సమీపంగా వచ్చిన 36గంటల ముందే తెలుస్తుందని చెప్పారు. కాని దీనిని ఇస్రో శాస్త్రవేత్తలు కొట్టి పారేస్తూ ఆ ఉపగ్రహం వలన భూమిపై ఎలాంటి ప్రమాదం జరుగదని చెపుతున్నారు.