సీఎం ఇలాఖాలో దీనస్థితిలో యువ వ్యవసాయ కూలి

542

    పేదరికం అనేది మన దేశములో ఒక శాపంగా మారిపోయింది. నాలుగు రాళ్ల కోసం రోజంతా కష్టపడి మూడు ముద్దలు నోట్లో పడేలోగా మరొక సమస్య వచ్చిపడిపోతుంది. అది ఒక్కోసారి ఆరోగ్య సమస్య అయిఉండొచ్చు లేక మరొక కుటుంభ సమస్య అయిఉండొచ్చు కాని సమస్య వచ్చిందంటే కుటుంబం విచ్చిన్నం వీధిన పడుతున్నాయి. ఇలాంటి సందర్భాలు రోజు మన దేశంలో ఎన్నో కనపడతాయి కాని వారిని పట్టించుకొనే నాధుడు చాలా తక్కువ కనిపిస్తారు. అయితే మన తెలంగాణ లో 31 ఏళ్ల ఒక దినసరి కూలి కూడ పచ్చకామెర్లతో ,కడుపుకు సంబందించిన వ్యాధితో భాదపడుతూ చావుతో పోరాడుతున్నాడు. ఇది చూసిన మనం ఫౌండేషన్ ,తెలంగాణ కబుర్లు టీం లు బాధిత వ్యక్తికీ తోచిన సహాయం చేయాలనీ ముందుకొచ్చాయి.

వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లాకు ,ఇబ్రహీం నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి పరశురామ్ ఒక వ్యవసాయ దినసరి కూలి.ఆయనకు భార్య మరియు 2.5 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయన భార్య ఇపుడు గర్భవతి. ఐతే జూన్ నెల 5వ తారీఖున తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడి గ్రామంలో ఉన్న RMP డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ వైద్యుడు ఉపశమనం కోసం కొన్ని మందులు ఇచ్చాడు. మళ్ళి 10 రోజుల తర్వాత మల్లి కడుపు నొప్పి రావటంతో కరీంనగర్లో ఉన్న SR హాస్పిటల్ కి వెళ్ళాడు. ఐతే వ్యాధి తీవ్రత ని గుర్తించిన ఆ వైద్యులు హైదరాబాద్ లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ కి రిఫర్ చేశాడు.
KIMS ఆసుపత్రులలో డా. శాస్త్రి మరియు బృందం అతన్ని పరిశీలించి అతను కొవ్వు కాలేయ( fatty liver) సమస్యతో బాధపడుతున్నాడని మరియు జీర్ణ వ్యవస్థ విఫలమయ్యాయని దానితో పాటు పచ్చ కామెర్లతో బాధ పడుతున్నారని చెప్పటం జరిగింది. కొవ్వుని ఆపరేషన్ చేసి తీసేయటం ఒకటే మార్గమని దానికి 22 లక్షలు అవసరమని చెప్పారు.

అపుడు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద 2 లక్షలు మంజూరు అవుతున్నాయి కాని ఇంకా 20 లక్షలు రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ సమస్యకు స్పందించిన మనం ఫౌండేషన్ వాళ్ళు తెలంగాణ కబుర్లు మీడియా వాళ్లతో కలిసి పరశురామ్ కి సహాయం చేయటానికి దాతల కోసం వెతకటం మొదలుపెట్టారు. ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితుడికి సహాయం చేయాలని కోరుతున్నారు. ఎవరైనా బాధితుడికి సహాయం చేయాలనీ అనుకుంటే మనం టీమ్ వాళ్ళను కాంటాక్ట్ అవొచ్చు.

    కాంటాక్ట్ నెంబర్ :+91 99489 90899​⁠​